ఏందిరా వదిలేస్తావా నన్ను..! - naga chaitanya saipallavi love story teaser
close
Published : 10/01/2021 12:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏందిరా వదిలేస్తావా నన్ను..!

‘లవ్‌స్టోరి’ టీజర్‌

హైదరాబాద్‌: నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌స్టోరి’ టీజర్ తాజాగా విడుదలయ్యింది. ఫీల్‌గుడ్‌ సినిమాల దర్శకుడు శేఖర్‌కమ్ముల దీనిని తెరకెక్కించారు. ‘అమిగోస్‌ క్రియేషన్స్’‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టీజర్‌ చూస్తుంటే మరో అందమైన ప్రేమకథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాదీ‌ స్టైల్లో  ‘జీరోకెల్లి వచ్చినా సార్‌.. చానా కష్టపడతా..మంచి ప్లాను ఉంది’ అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. రేవంత్‌ పాత్రలో చై, మౌనిక పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయినట్టు అనిపిస్తోంది. పవన్‌ సీహెచ్‌ అందించిన నేపథ్యసంగీతం ఆకట్టుకుంటోంది. చివర్లో నాగచైతన్యతో.. ‘ఏందిరా..వదిలేస్తావా నన్ను’ అంటూ సాయిపల్లవి అన్న మాటలు ప్రేక్షకులను ఎమోషన్‌కు గురిచేశాయి. ఆ లవ్‌లీ టీజర్‌ను మీరూ చూసేయండీ!

ఇవీ చదవండి!

పిల్లడు అదుర్స్‌.. సాంగ్‌ అదిరింది

ఘనంగా సింగర్‌ సునీత వివాహం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని