Love story: సమంత ట్వీట్‌కు సమాధానం ఇచ్చిన నాగచైతన్య! - naga chaitanya says thanks to samantha
close
Updated : 14/09/2021 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Love story: సమంత ట్వీట్‌కు సమాధానం ఇచ్చిన నాగచైతన్య!

హైదరాబాద్‌: నాగచైతన్య కథానాయకుడిగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘లవ్‌స్టోరీ’. సాయి పల్లవి కథానాయిక. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ యువతను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చై, సాయి పల్లవిల నటన, శేఖర్‌ కమ్ముల టేకింగ్‌ కట్టిపడేస్తోంది. అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా ఈ ట్రైలర్‌పై తమ స్పందన తెలియజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నాగచైతన్య సతీమణి సమంత స్పందించిన సంగతి తెలిసిందే. నాగచైతన్య చేసిన ట్రైలర్‌ ట్వీట్‌కు ‘విన్నర్‌. సాయిపల్లవి టీమ్‌ మొత్తానికి నా అభినందనలు’ అని సామ్‌ వ్యాఖ్యను జోడించారు. అందుకు ‘థ్యాంక్‌ యూ సో మచ్‌’ అంటూ సాయిపల్లవి కూడా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తాజాగా సమంత ట్వీట్‌పై నాగచైతన్య కూడా స్పందించారు. ‘థ్యాంక్స్‌ సామ్‌’ అంటూ సమంత ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఏషియన్‌ సినిమాస్‌ పతాకంపై నారంగ్‌ దాస్‌ కె నారంగ్‌, పుష్కర్‌ రామ్మోహన్‌ రావులు ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్‌ సీహెచ్‌ స్వరాలు సమకూర్చారు.

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని