సమంత బాటలో నాగచైతన్య - naga chaitanya to make his bollywood debut with aamir khans laal singh chaddha
close
Published : 25/01/2021 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత బాటలో నాగచైతన్య

బాలీవుడ్‌కు హీరో ఎంట్రీ ఇవ్వనున్నారా?

హైదరాబాద్‌: కెరీర్‌ విషయంలో హీరో నాగచైతన్య.. తన సతీమణి సమంతను అనుసరిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా రాణిస్తున్న సామ్‌.. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’ సిరీస్‌తో ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, వరుస ప్రేమకథా చిత్రాలతో తెలుగులో రాణిస్తున్న చైతన్య సైతం త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాలో నాగచైతన్య ఓ కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే చిత్రబృందం చైతన్యను సంప్రదించినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు చైతన్య ప్రస్తుతం ‘థ్యాంక్యూ’లో నటిస్తున్నారు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చదవండి

చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కన్నీళ్లుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని