close
Published : 07/04/2021 10:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వరుణ్‌ పెళ్లిపై నెటిజన్‌కు నాగబాబు కౌంటర్‌..

హైదరాబాద్: వరుణ్‌తేజ్‌ - సాయిపల్లవిల వివాహం గురించి నటుడు నాగబాబు స్పందించారు. ఈ మధ్య కాలంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో ఆయన మమేకం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా చేసిన ఇన్‌స్టా చాట్‌లో వరుణ్‌తేజ్‌ వివాహం గురించి ఓ నెటిజన్‌ నాగబాబుని ప్రశ్నించారు. దానికి ఆయన ఇచ్చిన కౌంటర్‌ అందర్నీ ఎంతగానో నవ్విస్తోంది.

‘వరుణ్‌తేజ్‌-సాయిపల్లవిల జోడీ చూడచక్కగా ఉంటుంది. కాబట్టి వాళ్లిద్దరికి పెళ్లి చేసేస్తా’ అంటూ ఓ నెటిజన్‌ నాగబాబుకు పోస్ట్‌ పెట్టాడు. దానిపై స్పందించిన ఆయన ‘జాతిరత్నాలు’లో బ్రహ్మానందం చెప్పే.. ‘తీర్పు కూడా మీరే ఇచ్చుకోండ్రా. అరేయ్‌ మనమెందుకు ఇక్కడ వెళ్లిపోదాం రండి’ అనే వీడియోతో నెటిజన్‌కు కౌంటర్‌ వేశారు. మరోవైపు, ఇటీవల కాలంలోనే ‘వరుణ్‌ అన్నకు పెళ్లి ఎప్పుడు చేస్తారు?’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘మంచి సంబంధాలు ఉంటే చూడండి’ అని నాగబాబు సమాధానమిచ్చిన విషయం తెలిసిందే.

శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ కోసం వరుణ్‌తేజ్‌-సాయిపల్లవి మొదటిసారి స్క్రీన్‌ పంచుకున్నారు. ఈసినిమాలో వీళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ యువతను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి ప్రాజెక్ట్‌ల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఓ వైపు ‘గని’ షూట్‌లో వరుణ్‌తేజ్‌ పాల్గొంటుండగా.. ‘లవ్‌స్టోరీ’, ‘విరాటపర్వం’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ పనుల్లో సాయిపల్లవి బిజీగా ఉంటున్నారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని