చైతన్యకు నాగబాబు ఖరీదైన గిఫ్ట్‌ - nagababu gives a spl surprice to chaitanya
close
Updated : 18/04/2021 09:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైతన్యకు నాగబాబు ఖరీదైన గిఫ్ట్‌

హైదరాబాద్‌: తన అల్లుడు చైతన్యను నటుడు నాగబాబు సర్‌ప్రైజ్‌ చేశారు. ఓ ఖరీదైన కారును బహుమతిగా అందించారు. దీనికి సంబంధించిన వీడియోని ఆయన నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. ‘మా అల్లుడు చైతన్యకు ఇప్పటివరకూ ఎలాంటి బహుమతులివ్వలేదు. ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇటీవల ఉగాదికి ఓ బహుమతి ఇద్దామనుకున్నాను.. కుదరలేదు. ఇప్పుడు అతడి కోసం ఓ రేంజ్‌రోవర్‌ డిస్కవరీ తీసుకున్నాం’ అని నాగబాబు తెలిపారు. నిహారిక-చైతన్య దంపతులను నాగబాబు దంపతులు కలిసి.. ఆ కారుని బహూకరించారు.

నాగబాబు కుమార్తె నిహారికకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌విలాస్‌లో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. మెగా కుటుంబసభ్యులు, బంధువులు, సినీ పరిశ్రమకు చెందిన అతి తక్కువమంది ప్రముఖులు ఈ వివాహ వేడుకలో సందడి చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని