close
Published : 11/04/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పవన్‌ నటించలేదు: నాగబాబు

హైదరాబాద్‌: ‘వకీల్‌సాబ్‌’లో పవన్ నటించలేదని ఆయన సోదరుడు నాగబాబు అన్నారు. ఇటీవల ‘వకీల్‌సాబ్‌’ చిత్రాన్ని వీక్షించిన ఆయన సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘చాలారోజుల తర్వాత నేను థియేటర్‌లో సినిమా చూశాను. ‘అత్తారింటికి దారేది’ తర్వాత కల్యాణ్‌బాబు నటించిన సినిమాలు నేను చూడలేదు. ‘అజ్ఞాతవాసి’ ఫలితం మా అందర్నీ ఎంతో బాధించింది. ఈ క్రమంలోనే పవన్‌ సినిమాలకు దూరమై.. రాజకీయాల్లో బిజీ అయ్యాడు. దాదాపు మూడేళ్ల తర్వాత కల్యాణ్ ‘వకీల్‌సాబ్‌’తో ప్రేక్షకుల ముందుకు రావడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇందులో కల్యాణ్‌ నటించలేదు. సాధారణ జీవితంలో ఎలా ఉంటాడో అలాగే ఈ సినిమాలో కనిపించాడు’ అని నాగబాబు తెలిపారు.

‘వకీల్‌సాబ్‌’ బెన్‌ఫిట్‌ షోలను ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో నిలిపివేయడం గురించి నాగబాబు స్పందించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ఇలాంటి పనులు చేసే వ్యక్తి కాదని తాను నమ్ముతున్నానని, పరిపాలనకు సంబంధించి ఎన్నో సమస్యలపై పోరాటం చేస్తూ ఆయన బిజీగా ఉన్నారని.. కేవలం స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు మాత్రమే ఈ పనులు చేసి ఉంటారని నాగబాబు అన్నారు. అంతేకాకుండా జగన్‌కు ఒకవేళ ఈ విషయం తెలిస్తే తప్పకుండా ఆయన స్పందించే అవకాశముందన్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా ఫర్వాలేదు కానీ వృత్తిపరమైన జీవితంలో ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తే సినిమాపైనే ఆధారపడి బతుకుతున్న ఎన్నో కుటుంబాలు, కార్మికులు నష్టపోతారని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని