Cineme news: నాగార్జున చిత్రం.. రెండో షెడ్యూల్‌కు సిద్ధం.. - nagarjuna praveen sattaru movie shoot resume from august 4th
close
Published : 02/08/2021 22:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cineme news: నాగార్జున చిత్రం.. రెండో షెడ్యూల్‌కు సిద్ధం..

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో షూటింగ్‌ వాయిదా పడింది. ఇటీవల కరోనా తీవ్రతలో కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చేయడంతో పలు సినిమాలు జోరుగా షూటింగ్‌ జరుపుకొంటున్నాయి. ఈ క్రమంలోనే నాగార్జున-ప్రవీణ్‌సత్తారు చిత్రం కూడా రెండో షెడ్యూల్‌ కోసం సిద్ధమవుతోంది. గోవాలో మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. సెకండ్‌వేవ్‌ తర్వాత జూన్‌లో చిత్రీకరణ మొదలు పెట్టాలని భావించింది. అయితే అది కుదరలేదు. దీంతో ఆగస్టు 4 నుంచి మళ్లీ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీవేంకటేశ్వర ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘గరుడ వేగ’తో మంచి విజయం సాధించిన డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రాన్ని యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారు. మరోవైపు నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్‌’కు మిశ్రమ స్పందన వచ్చింది.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని