నాగార్జున ‘వైల్డ్‌డాగ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది! - nagarjuna starer wild dog trailer released
close
Updated : 12/03/2021 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగార్జున ‘వైల్డ్‌డాగ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు నాగార్జున కీలక పాత్రలో అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వైల్డ్‌డాగ్‌’. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు చిరంజీవి విడుదల చేశారు. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(NIA) ఏజెంట్‌ విజయ్‌ వర్మగా నాగార్జున అదరగొట్టారు. కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు విజయ్‌ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్‌ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన, తన టీమ్‌తో కలిసి ఎలా మట్టుపెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రం చూడాల్సిందే. ‘‘ఒక మన దేశంలో వందల మందిని చంపి మీరేమీ చేయలేరు అంటే.. నేను అందుకు అంగీకరించను’’ అంటూ నాగార్జున చెబుతున్న డైలాగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

‘‘నా సోదరుడు నాగ్‌ ఇందులో ఎప్పటిలాగే చాలా కూల్‌గా.. ఎనర్జిటిక్‌గా కనిపించారు. ఏ జోనర్‌ సినిమా అయినా చేయడానికైనా భయం లేకుండా ముందడుగు వేసే నటుడు అతను. ‘వైల్డ్‌డాగ్‌’ చిత్ర బృందానికి, మా నిర్మాత నిరంజన్‌రెడ్డికి శుభాకాంక్షలు’’ -ట్విటర్‌లో చిరంజీవి

అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌, రుద్రా గౌడ్‌, హష్వంత్‌ మనోహర్‌ కనిపించనున్నారు. సయామీ ఖేర్‌ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. ఏప్రిల్‌ 2న ‘వైల్డ్‌డాగ్‌’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని