ఓటీటీలో ‘వైల్డ్‌ డాగ్’: ఫిక్సయిందా? - nagarjuna wild dog in netflix
close
Published : 02/01/2021 19:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో ‘వైల్డ్‌ డాగ్’: ఫిక్సయిందా?

హైదరాబాద్: ఒకవైపు కరోనా పరిస్థితులు చక్కబడుతుండటం, మరోవైపు వ్యాక్సిన్‌ వస్తుండటంతో నెమ్మదిగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. సంక్రాంతి కానుకగా పలు తెలుగు సినిమాలు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అయినా, కొన్ని చిత్రాలు ఓటీటీకే మొగ్గు చూపుతున్నాయి. నాగార్జున కథానాయకుడిగా అహిషోర్‌ సాల్మాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌ భారీ మొత్తాన్ని ఇచ్చి హక్కులు పొందినట్లు సమాచారం. జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా దీన్ని విడుదల చేయనున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నాగార్జున ఇందులో ఎన్‌ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఆయనతో పాటు, సయామీఖేర్‌, దియా మీర్జా, అతుల్‌ కుల్‌కర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని