Nagarjuna Sagar Dam:నాగార్జున సాగర్‌ 14 గేట్లు ఎత్తిన అధికారులు - nagarjunasagar crust gates opened and water released
close
Updated : 01/08/2021 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nagarjuna Sagar Dam:నాగార్జున సాగర్‌ 14 గేట్లు ఎత్తిన అధికారులు

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌లో కృష్ణమ్మ సందడి మొదలైంది. శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నాగార్జున సాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 584 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ఈరోజు సాయంత్రం 14 క్రస్టు గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ ఇన్‌ఫ్లో 5.14లక్షల క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలం, సాగర్‌, పులిచింతల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వస్తుంది. ఇవాళ సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు సుమారు లక్ష క్యూసెక్కులు, రేపటి వరకు సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందును కృష్ణా నది తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని