Tollywood: వరుణ్, శౌర్య ఫైట్‌.. తారక్‌ హోస్ట్‌ - nagashourya varun tej new movies shoots resume today
close
Updated : 10/07/2021 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: వరుణ్, శౌర్య ఫైట్‌.. తారక్‌ హోస్ట్‌

హైదరాబాద్‌: యువ నటులు వరుణ్‌ తేజ్‌, నాగశౌర్య చాలారోజుల తర్వాత తమ ప్రాజెక్ట్‌లను మళ్లీ పట్టాలెక్కించేశారు. కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా గతకొన్ని నెలల నుంచి పరిశ్రమలో పనులన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఇండస్ట్రీలో మళ్లీ సందడి ప్రారంభమైంది. తాజాగా రెండు చిత్రాల షూటింగ్‌ శనివారం మొదలైంది.

ఆఖరి రౌండ్‌..!

బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న యాక్షన్‌, స్పోర్ట్స్ డ్రామా ‘గని’. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. శనివారం ఈసినిమా ఆఖరి షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా క్లైమాక్స్‌ షూట్‌ చేయనున్నారు. ఇందుకోసం వరుణ్‌ ఇప్పటికే సిద్ధమయ్యారు. ప్రత్యేకంగా జిమ్‌ ట్రైనర్‌ను నియమించుకుని శరీరాకృతి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


లక్ష్యం తప్పకూడదు..!

క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న మరో కమర్షియల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘లక్ష్య’. నాగశౌర్య కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఆర్చెరీ క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో నాగశౌర్య మునుపెన్నడూ లేని విధంగా సిక్స్‌ ప్యాక్‌ దేహం, పొడవాటి జుట్టుతో కనిపించనున్నారు. ఈ సినిమా క్లైమాక్స్‌ షూట్‌ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా ఓ స్పెషల్‌ వీడియోని చిత్రబృందం పోస్ట్‌ చేసింది.


ఎన్టీఆర్ కూడా..!

‘బిగ్‌బాస్‌’తో హోస్ట్‌గా అలరించిన తారక్‌ ఇప్పుడు మరోసారి అదే రూట్‌లో ప్రేక్షకుల్ని మెప్పించడానికి సిద్ధమయ్యారు. ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ రియాల్టీ షోకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ షో షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని