టీకా‌ తీసుకోమంటే ఆ పోలీస్‌ నవ్వుతున్నాడు! - nagland police laughing while getting vaccine
close
Updated : 09/03/2021 04:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా‌ తీసుకోమంటే ఆ పోలీస్‌ నవ్వుతున్నాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్‌ను ఇంజక్షన్‌ రూపంలో చేతికి ఇస్తారనే విషయం తెలిసిందే. అయితే, కొంతమంది ఇంజక్షన్‌ తీసుకోవడానికి భయపడుతుంటారు. మరికొందరు ఇంజక్షన్‌ ఇచ్చే సమయంలో ఏడుస్తారు. కానీ, వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వచ్చిన ఓ పోలీస్‌.. ఇంజక్షన్‌ ఇవ్వడానికి నర్సు అతడి చేతిని పట్టుకోగానే చక్కిలిగింతలతో నవ్వడం మొదలుపెట్టాడు. ఇద్దరు నర్సులు ఆయన్ను పట్టుకొని వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ప్రయత్నించినా నవ్వుతూనే ఉన్నాడు. ఆ వీడియోను ఐపీఎస్‌ అధికారి రుపిన్‌ శర్మ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘నాగాలాండ్‌కు చెందిన ఈ పోలీస్‌ మొత్తానికి వ్యాక్సిన్‌ తీసుకున్నాడో లేదో తెలియట్లేదు. అతడిని సూది కన్నా చక్కిలిగింతలే ఎక్కువగా కలవరపెడుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. సూది తీసుకోకుండా చక్కిలిగింతలకు నవ్వుతున్న ఆ పోలీస్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని