నగ్మాకు కరోనా - nagma tests covid-19 positive
close
Published : 08/04/2021 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నగ్మాకు కరోనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: అలనాటి హీరోయిన్‌, రాజకీయ నాయకురాలు నగ్మా కరోనా బారిన పడ్డారు. ఏప్రిల్‌ 3న కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారామె. తర్వాత కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉంటున్నానని తెలిపారు. అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఉండాలని, టీకా తీసుకున్నా కరోనా సోకితే కంగారు పడాల్సిందేమీ లేదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్విటర్ ద్వారా కోరారు. నగ్మా 1990లో వచ్చిన హిందీ సినిమా ‘భాఘీ’ ద్వారా పరిచయం అయ్యారు. హీరోయిన్‌గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, భోజ్‌పురి భాషల్లోని పలు చిత్రాల్లో నటించిన ఆమె 2008లో సినిమాలకు స్వస్తి చెప్పారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని