నమ్రత నా స్నేహితురాలు: మంజుల - namrata is not only my sister-in-law but a good friend: manjula
close
Published : 03/06/2021 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నమ్రత నా స్నేహితురాలు: మంజుల

ఇంటర్నెట్‌ డెస్క్: సహజంగా అనేక కుటుంబాల్లో చాలా వరకు  కోడళ్లకు - ఆడపడుచులకు మధ్య పెద్దగా సఖ్యత కనిపించదు. ఒకరిపై ఒకరు కస్సుబుస్సుమంటుంటారు. కానీ ఇక్కడ ఓ ఆడపడుచు మాత్రం మా మరదలు ఎంతో మంచిదని కితాబిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు సూపర్‌స్టార్‌ కృష్ణ కూతురు, దర్శకురాలు ఘట్టమనేని మంజుల. తాజాగా ఆమె మహేష్‌బాబు సతీమణి నమత్రతో కలిసి ఉన్న ఓ పొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘‘నమ్రతతో కలిసి గడిపే సమయాన్ని ఎంతో ఆస్వాదిస్తాను. ఆమె నా మరదలు మాత్రమే కాదు.. మంచి స్నేహితురాలు కూడా. ఆమె నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సమర్థత కలిగిన వ్యక్తి నమత్ర’’ అంటూ పేర్కొంది. ఇటీవల కృష్ణ పుట్టినరోజు వేడుకను ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా కలిసి ఘనంగా జరుపుకున్నారు. మంజుల ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రానికి దర్శకత్వం చేసింది. అంతకు ముందే ‘షో’, ‘కావ్యాస్‌ డైరి’, ‘సేవకుడు’ లాంటి చిత్రాల్లోనూ నటించింది. ‘ఆరెంజ్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌ సోదరిగా చేసింది. ప్రస్తుతం ‘నషా’ అనే వెబ్‌ సీరీస్‌ చిత్రాన్ని నిర్మిస్తోంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని