ఇదే ‘నాంది’..రాక్షసాన్ని కూల్చడానికి!  - nanadhi movie song teaser
close
Published : 13/02/2021 13:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇదే ‘నాంది’..రాక్షసాన్ని కూల్చడానికి! 

హైదరాబాద్‌: అల్లరి నరేశ్‌‌ ఎక్కువగా హాస్యప్రధాన చిత్రాల్లోనే నటిస్తుంటారు. కానీ, ‘నేను’ ‘గమ్యం’ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్‌’వంటి చిత్రాలు ఆయనలోని విలక్షణ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ఆ తరహాలోనే త్వరలో రానున్న ‘నాంది’ చిత్రంతో మరోసారి తనలోని సీరియస్‌ నటుడిని నరేశ్‌‌ చూపించబోతున్నారు. తాజాగా ఆ చిత్రంలోనే ‘ఇదే నాంది..’ అంటూ సాగే ఎమోషనల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. సాయిచరణ్‌ పాకాల మ్యూజిక్‌ కంపోజ్‌ చేయగా సింగర్‌ విజయ్‌ ప్రకాష్‌ భావోద్వేగంగా ఈ పాటను ఆలపించారు. చైతన్య ప్రసాద్‌ దంతులూరి సాహిత్యం అందించారు. ఇటీవలే విడులైన ఈ చిత్ర ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. విజయ్‌ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్నారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 19న థియేటర్లలో విడుదల కానుంది. అప్పటిదాకా ఈ లిరికల్‌ వీడియోను చూసేయండి!

ఇవీ చదవండి!

సల్మాన్‌కు విలన్‌గా ఇమ్రాన్‌హష్మీ?

అందుకే ప్రభాస్‌ని పరిచయం చేయలేకపోయా!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని