పూరితో సినిమాపై బాలయ్య క్లారిటీ - nandamuri balakrishna movie with puri jagannadh
close
Published : 20/07/2021 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పూరితో సినిమాపై బాలయ్య క్లారిటీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో పూరి జగన్నాథ్‌ డైరెక్టర్‌గా వచ్చిన ‘పైసా వసూల్‌’ బాలయ్య మాస్‌ ఇమేజ్‌ను మరింత పెంచింది. ఇదిలా ఉండగా.. ఈ ఇద్దరూ మరో సినిమా కోసం జట్టు కట్టబోతున్నారని గత కొంతకాలంగా వస్తున్న ఈ వార్తలపై బాలయ్య స్పందించారు. తన షెడ్యూల్‌లో పూరితో ఓ సినిమా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో కలిసి ‘ఆఖండ’ తీర్చిదిద్దుతున్నారాయన. ఆ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తర్వాత గోపీచంద్‌ మలినేనితో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ ఓ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తర్వాతి ప్రాజెక్టుల వివరాలు వెల్లడించారు. అనిల్‌ రావిపూడితో ఓ సినిమా, దాని తర్వాత హరికాఅండ్‌హాసిని క్రియేషన్స్‌ నిర్మాణంలో ఒక చిత్రం చేయనున్నట్లు ఆయన తెలిపారు. పూరి జగన్నాథ్‌తో కలిసి ఒక సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ ‘లైగర్‌’ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు బాలయ్య సంతకం చేసిన సినిమాలన్నీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పూరి-బాలయ్య ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు కాస్త పట్టేలా కనిపిస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ దసరా కానుకగా అక్టోబర్‌లో ప్రేక్షకుల మందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పవర్‌ఫుల్‌, యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రగ్యాజైశ్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని