త్వరలో వేట షురూ
close
Published : 11/06/2021 04:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలో వేట షురూ

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గురువారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. త్వరలో వేట మొదలు కానున్నట్లు తెలియజేశారు. బాలకృష్ణ నటించే 107వ చిత్రం. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో బాలయ్య ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారు. సంగీత దర్శకుడిగా తమన్‌ను ఖరారు చేశారు. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక వివరాలను ప్రకటిస్తామని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ చిత్రం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే ఈ కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుంది. ఇందులో బాలయ్యకు జోడీగా ఇద్దరు కథానాయికలు కనిపించనున్నట్లు తెలుస్తోంది. శ్రుతిహాసన్‌, త్రిష పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం వినిపిస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని