నా పేరు వాడితేనే ఆనందిస్తా: నందినీ రెడ్డి - nandini reddy about lady director tag
close
Published : 03/06/2021 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా పేరు వాడితేనే ఆనందిస్తా: నందినీ రెడ్డి

ఇంట‌ర్నెట్ డెస్క్‌: తొలి ప్ర‌యత్నం ‘అలా మొద‌లైంది’ చిత్రంతోనే ద‌ర్శ‌కురాలిగా త‌న‌దైన ముద్ర వేశారు నందినీ రెడ్డి. త‌ర్వాత ‘జ‌బ‌ర్ద‌స్త్‌’, ‘క‌ల్యాణ వైభోగ‌మే’, ‘ఓ బేబీ’ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న నందినీ లేడీ డైరెక్ట‌ర్ ట్యాగ్‌పై తాజాగా స్పందించారు. జెండ‌ర్ ఆధారంగా గుర్తింపుకంటే త‌న‌ పేరుతోనే పిలిస్తే బాగుంటుంద‌న్నారు. ‘‘లేడీ డైరెక్ట‌ర్, నందినీ రెడ్డి..  ఈ రెండింటికీ ఇంగ్లిష్ అక్ష‌రాలు పన్నెండే కదా! టైప్ చేసేందుకు ఒకేలా శ్ర‌మ ప‌డాలి క‌దా. మ‌రి చ‌క్క‌గా నా పేరు వాడితే ఆనందిస్తా. అన‌వ‌స‌రంగా ఈ లింగ బేధాలు ఎందుక‌మ్మా?’’ అని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న అభిప్రాయం పంచుకున్నారు. దీన్ని చూసిన కొంద‌రు న‌టులు కామెంట్ల రూపంలో నందినీకి మ‌ద్దతు తెలిపారు. ‘ఏక్ మినీ క‌థ‌’తో అల‌రించిన సంతోష్ శోభ‌న్ హీరోగా నందినీ రెడ్డి ఓ చిత్రం తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయని తెలుస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అని సినీ వ‌ర్గాల స‌మాచారం. మ‌రికొన్ని రోజుల్లో దీనిపై స్ప‌ష్ట‌త రానుంది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని