RIP Nandyala Ravi: రచయిత నంద్యాల రవి కన్నుమూత - nandyala ravi dies due to corona
close
Published : 14/05/2021 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RIP Nandyala Ravi: రచయిత నంద్యాల రవి కన్నుమూత

హైదరాబాద్‌: తెలుగు చిత్రపరిశ్రమలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు నటీనటులు కరోనా బారినపడి కోలుకుంటూ ఉండగా.. మరికొంత మంది మాత్రం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడుస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ రచయిత నంద్యాల రవి కరోనాతో పోరాటం చేసి కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.

నంద్యాల రవి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నంద్యాల రవి ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్న ప్రముఖ నటుడు సప్తగిరి ఇటీవల ఆయన కుటుంబానికి రూ.లక్ష విరాళంగా అందించారు. అదే విధంగా నిర్మాత రాధామోహన్‌ సైతం రూ.లక్ష ఆర్థికసాయం చేసిన విషయం విదితమే. రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా నటించిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రానికి నంద్యాల రవినే రచయితగా పనిచేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని