సినిమాల్ని అలా చూడటం నా బాధ్యత: నాని - nani about cinema
close
Published : 25/04/2021 18:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినిమాల్ని అలా చూడటం నా బాధ్యత: నాని

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బాగా ఆకట్టుకునే సినిమాలనే కాదు ఆకట్టుకోని చిత్రాల్నీ థియేటర్‌లో ఆఖరి నిమిషం వరకు చూస్తా’ అన్నారు యువ కథానాయకుడు నాని. రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నంబరు 1 యారి’ కార్యక్రమానికి ‘టక్‌ జగదీష్‌’ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, నాయిక రీతూ వర్మతో కలిసి విచ్చేశారాయన. ‘థియేటర్‌లో మొత్తం సినిమా చూడలేక మధ్యలో వెళ్లిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా’ అని రానా అడగ్గా.. ఏదైనా చిత్రం బాలేదు అనిపించినా ఎందుకో మధ్యలో లేచి వెళ్లను.. వెళ్లలేను. సినిమాని పూర్తిగా చూడటం ఓ బాధ్యత నాకు. మా ఇంట్లో వాళ్లు కూడా వీడితో సినిమాకు వెళ్తే ఇదో సమస్య అనే ఆలోచనలో ఉంటారు అని చెప్పుకొచ్చారు నాని. దీనికి స్పందిస్తూ ‘అందుకే ధైర్యంతో నా సినిమాల ఎడిటింగ్‌కి నిన్ను పిలుస్తా.. లేవకుండా చివరి వరకు చూస్తూనే ఉంటావు’ అని రానా నవ్వులు పంచుతున్నారు. దీంతోపాటు నాని, రీతూ, శివకి ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు రానా. ఆ అంతుచిక్కని మ్యాజిక్‌కి వాళ్లెలా ఆశ్చర్యపోయారో చూసేయండి..
 





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని