‘కలర్‌ ఫోటో’ చిట్టిముత్యం.. ఎవరైనా కాదంటే..? - nani and SS Karthikeya comments on color photo
close
Published : 25/10/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కలర్‌ ఫోటో’ చిట్టిముత్యం.. ఎవరైనా కాదంటే..?

హైదరాబాద్‌: ‘కలర్‌ ఫోటో’ చిత్ర బృందంపై నాని, ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు కురిపించారు. చక్కటి కథాంశంతో చిత్రాన్ని రూపొందించారంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. సుహాస్‌, చాందిని, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు. కాల భైరవ సంగీతం సమకూర్చారు. అక్టోబరు 23న ఓటీటీ వేదికగా ఆహాలో చిత్రం విడుదలైంది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభించింది. దీన్ని చూసిన నాని ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఈ చిత్రం నాకెంతో నచ్చింది. చిట్టి ముత్యం ఈ సినిమా. కాదని ఎవరన్నా అంటే..’ అని ట్వీట్‌ చేశారు.

‘‘కలర్‌ ఫోటో’లోని ప్రతి సన్నివేశం నాకు వినోదం పంచింది. సుహాస్‌ ప్రతి ఫ్రేమ్‌లో నచ్చాడు. అతడికి నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉంది. సందీప్‌ రాజ్‌ సినిమా చాలా బాగా రాసి, తీశావు. కాన్సెప్ట్‌ నాకెంతో నచ్చింది. సునీల్‌ గారు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అదరగొట్టేశారు సర్. మా తమ్ముడని కాదు కానీ, నేపథ్య సంగీతం, పాటలతో కాల భైరవ సినిమాకు ప్రాణం పోశాడు. ‘కలర్‌ ఫోటో’ సినిమా చూడండి..’ అని కార్తికేయ ట్వీట్లు చేశాడు.

‘‘కలర్‌ ఫోటో’పై పాజిటివ్‌ కామెంట్లు చాలా విన్నా. సంతోషంగా ఉంది. మొత్తం చిత్ర బృందానికి కుడోస్‌’ అని మంచు మనోజ్‌ పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని