నాని నటన చూసి ఏడ్చేశా: షాహిద్‌కపూర్‌ - nani made me cry many times reveals shahid kapoor
close
Published : 24/06/2021 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాని నటన చూసి ఏడ్చేశా: షాహిద్‌కపూర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేచురల్‌ స్టార్‌ నాని నటనకు ఫిదా కానివారు ఉంటారా..! ముఖ్యంగా ‘జెర్సీ’ సినిమాలో క్రికెటర్‌గా కనిపించిన నాని.. తన యాక్టింగ్‌తో అందర్నీ కంటతడి పెట్టించాడు. ఈ చిత్రం చూసి నాలుగైదుసార్లు ఏడ్చేశానని బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌కపూర్‌ అన్నాడు. ఆ సినిమాలో నాని నటన అద్భుతమని కొనియాడాడు. షాహిద్‌ ప్రధానపాత్రలో ‘జెర్సీ’కి హిందీ రీమేక్‌ తెరకెక్కుతోంది. ఇప్పటికే ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ‘కబీర్‌సింగ్‌’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన షాహిద్‌ మరోసారి తెలుగు సినిమా రీమేక్‌తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో షాహిద్‌ మాట్లాడుతూ.. ‘జెర్సీ’ తనకెంత ప్రత్యేకమో వివరించాడు.

‘‘జెర్సీ’ సినిమా నా జీవితానికి చాలా దగ్గరగా ఉన్న కథ. నా వయస్సు 40 ఏళ్లు.. జీవితంలో ఆలస్యంగా సక్సెస్‌ అందుకోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా చాలా ఆలస్యంగా సక్సెస్‌ అందుకున్నవాడినే. నా మనసుకు బాగా దగ్గరైందీ చిత్రం. ఈ సినిమాలో నాని నటన అద్భుతం. ఆ సినిమాలో నాని యాక్టింగ్‌ చూసి నేను ఏడుపు ఆపుకోలేకపోయాను’’ అని ఈ బాలీవుడ్‌ నటుడు పేర్కొన్నాడు. తెలుగులో ‘జెర్సీ’ని తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి హిందీ రీమేక్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. పంకజ్‌ కపూర్‌, మృనాల్‌ ఠాకూర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ మధ్యే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.  ‘జెర్సీ’కి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం వచ్చిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని