Dasara: వావ్‌.. ఇంతకుముందెప్పుడూ చూడని నాని.. ‘దసరా’తో వస్తున్నాడు! - nani siren of dasara
close
Published : 15/10/2021 21:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dasara: వావ్‌.. ఇంతకుముందెప్పుడూ చూడని నాని.. ‘దసరా’తో వస్తున్నాడు!

హైదరాబాద్‌: కథ, పాత్ర ఎలాంటిదైన తనదైన సహజ నటనతో దానికి మరింత వన్నె తెచ్చే యువ కథానాయకుడు నాని. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అభిమానులే కాదు, కుటుంబ ప్రేక్షకులు, యువత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే, గత కొంతకాలంగా నాని అభిమానుల అంచానాలను అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మరో వైవిధ్యమైన, కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ కథానాయిక. పూర్తి తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. విజయదశమి పండగ సందర్భంగా విడుదల చేసిన ‘సైరెన్‌ ఆఫ్‌ దసరా’లో ‘జమ్మి వెట్టి జెప్తాన్న బద్దల్ బాసింగాలైతై సూస్‌కుందాం’ అంటూ నాని తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. మరి ఈ చిత్ర నేపథ్యం ఏంటి? నాని ఎలా కనిపించనున్నారు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఎస్‌ఎల్‌వీసీ బ్యానర్‌ఫై ఈ చిత్రం తెరకెక్కుతోంది.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని