జగన్‌ పిల్లలకే విదేశీ చదువులా?: లోకేశ్‌ - nara lokesh comments on ap govt
close
Updated : 28/12/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్‌ పిల్లలకే విదేశీ చదువులా?: లోకేశ్‌

అమరావతి: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పిల్లలకే విదేశీ చదువులా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా అని విమర్శించారు. ప్రైవేటు కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వైకాపా ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఖండిస్తున్నామని ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి మంచిది కాదని హితవు పలికారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దు చర్యకు సంబంధించిన జీఓను తక్షణమే వెనక్కి తీసుకొని, పథకం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. తెదేపా హయాంలో తీసుకొచ్చిన ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఎన్నికల ముందు కూతలు.. అధికారంలోకి వచ్చాక కోతలు అని మండిపడ్డారు. 

ఇవీ చదవండి..
కరోనా చివరి మహమ్మారి కాదు: WHO

సింగర్‌ సునీత-రామ్‌ల ప్రీ వెడ్డింగ్‌ పార్టీమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని