AP News: మా ఓపికను పరీక్షించొద్దు: లోకేశ్‌ - nara lokesh pressmeet
close
Updated : 18/06/2021 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: మా ఓపికను పరీక్షించొద్దు: లోకేశ్‌

గడివేముల: వైకాపా అరాచకాలకు తాము భయపడి పారిపోయే వాళ్లం కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 27 మంది తెదేపా కార్యకర్తలను దారుణంగా చంపారని ఆయన ఆరోపించారు. కర్నూలు జిల్లా పెసరవాయిలో గురువారం హత్యకు గురైన తెదేపా నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కుటుంబాలను లోకేశ్‌ పరామర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల తరఫున పోరాడుతున్న వారిపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైకాపా నేతలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

‘‘నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిని వాహనంతో ఢీకొట్టించి దారుణంగా హతమార్చారు. బాధిత కుటుంబసభ్యులకు అండగా ఉంటాం. అన్ని రకాలుగా ఆ కుటుంబాలను ఆదుకుంటాం. తెదేపా కార్యకర్తలను బెదిరించి, నాయకులను చంపితే మేం వెనక్కి తగ్గుతామని అనుకుంటున్నారా?మిమ్మల్ని వదిలిపెట్టం. మా కార్యకర్తలను భయపెడితే పార్టీకి నష్టం తేవచ్చని మీరు అనుకుంటున్నారు. అలా అనుకోవడం చాలా పొరపాటు. తెదేపా ఎక్కడికీ పోదు. మేం మీకు భయపడి పారిపోయేవాళ్లం కాదు. ధైర్యంగా నిలబడి ప్రజల తరఫున పోరాడతాం. మంచి పని చేయాలంటే అభివృద్ధి చేయండి. రాయలసీమకు కొత్త పరిశ్రమలు తీసుకురండి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయండి. మీకు చేతకాకే మా కార్యకర్తలు, నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. మా ఓపికను పరీక్షించొద్దు.. బీ కేర్‌ఫుల్‌. సమయం వస్తుంది.. అప్పుడు నేతలు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులకు గుణపాఠం చెప్పే బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని తెదేపా కార్యకర్తలకు హామీ ఇస్తున్నా’’ అని లోకేశ్‌ అన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని