‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్‌   - naresh interview about srikaram movie
close
Published : 06/03/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్‌  

హైదరాబాద్‌: రైతు గొప్పతనాన్ని, వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియజేసే చిత్రం ‘శ్రీకారం’. శర్వానంద్ కథానాయకుడిగా బి.కిశోర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.  ప్రియాంకా అరుళ్ మోహ‌న్ కథానాయిక. 14 రీల్స్ ప్లస్‌ పతాకంపై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ‘శ్రీ‌కారం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా గురించి నరేష్‌ మాట్లాడారు.

‘‘ప్రస్తుతం ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. ‘శ్రీకారం’ చిత్రంలో నాది రైతు పాత్ర. కానీ, ఇది పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం. ఈ చిత్ర నిర్మాతలు దగ్గరుండీ అన్నీ చూసుకున్నారు. 14 రీల్స్ సంస్థకి ఈ సినిమా కచ్చితంగా అవార్డులు, రివార్డులు తెస్తుంది. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. చిత్రం కోసం నిర్మాతలు ఇరవై ఎకరాల్లో సెట్‌ వేశారు. పొలంలో సెట్ వేయడమనేది చాలా గొప్ప ఆలోచన. లాక్‌డౌన్‌కి ముందు తర్వాత మూడు సార్లు సెట్‌ వేశారు. ఎంత ఖర్చు, శ్రమతో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చు’’

‘‘శర్వానంద్‌ని చాలా అభినందించాలి. కొత్త తరానికి అనుగుణంగా సినిమాలు చేస్తాడు. సినిమాకి బుర్రా సాయిమాధవ్‌ మాటలు, మిక్కీ జె మేయర్‌ సంగీతం అదనపు బలం. చిత్తూరు ప్రాంత రైతుగా నేను కొత్తగా కనిపిస్తా. దర్శకుడు కొత్తవాడైనా తనకు కావాల్సినట్లు మలుచుకున్నాడు. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’’

‘‘ఈ మధ్య పట్టణాలు పెరుగుతున్నాయి. పల్లెలు తగ్గుతున్నాయి. ఓ వ్యక్తి తన సొంతూరిని వదిలి పెట్టి, పట్టణానికి వచ్చేటప్పుడు ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు. ఇందులో నా పాత్ర పల్లె నుంచి పట్టణానికి వచ్చేస్తుంది. ఇప్పుడొచ్చే సినిమాలు గతంలో రాలేదు. ఈ సినిమా బి,సి సెంటర్లలోనూ బాగా ఆడుతుంది. వారికి కచ్చితంగా కనెక్టు అవుతుంది. నాకోసం యువ దర్శకులు కూడా నా పాత్రలు రాసుకుంటున్నారు’’

‘‘పోస్ట్ కోవిడ్‌ తర్వాత తెలుగు చిత్రానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ప్రస్తుతం 80 సినిమాలు షూటింగ్‌ జరుపుకొంటున్నాయి. తెలుగు సినిమా కలెక్షన్స్ రూ.300 కోట్లు దాటాయి. ప్రతి చిత్రసీమ తెలుగు సినిమా రంగంవైపు చూస్తోంది. తెలుగు నటుడిగా, తెలుగు వ్యక్తిగా గర్వపడుతున్నాను’’

‘‘సినిమా సక్సెస్‌ రేటు కానీ, వచ్చే కొత్త వేవ్ మనకు కనిపిస్తోంది. ఇప్పుడంతా యువదర్శకుల వరద వస్తోంది. ప్రేక్షకుల్లోనూ పూర్తి మార్పు వచ్చింది. కచ్చితంగా కొత్త మార్పు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో నేను నటిస్తుండటం చాలా గొప్పగా ఉంది. లాక్‌డౌన్‌కి ముందు కూడా నేను మంచి సినిమాల్లోనే నటించా. వాటిలో ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’ ఒకటి. గత నాలుగు నెలల్లో 12 సినిమా చేశా. కెరీర్‌ పరంగా నాకు ‘శ్రీకారం’లో మంచి పాత్ర. ప్రస్తుతం నేను కొత్త గెటప్స్ వేస్తున్నా. విలన్‌గా, కీలక పాత్రల్లో నటిస్తున్నా. నాకు స్పూర్తి ఎస్వీరంగారావు’’
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని