నట్టూ మిస్‌.. చక్రవర్తి, తెవాతియా డౌట్‌ - natarajan miss tewatia and chakravarthy doubt for england series
close
Updated : 10/03/2021 10:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నట్టూ మిస్‌.. చక్రవర్తి, తెవాతియా డౌట్‌

ఇంగ్లాండ్‌ సిరీస్‌ ముందు కోహ్లీసేనకు ఇబ్బందులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసుకు ముందు టీమ్‌ఇండియాలో ముగ్గురు ఆటగాళ్లపై సందేహాలు నెలకొన్నాయి. యార్కర్ల వీరుడు నటరాజన్‌ జట్టుకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ తెవాతియా దేహదారుఢ్య పరీక్షల్లో విఫలమయ్యారని సమాచారం.

మరో రెండు రోజుల్లో ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ ఆరంభం కానుంది. మార్చి 12 సాయంత్రం 7 గంటలకు తొలి టీ20లో రెండు జట్లు తలపడతాయి. ఒక రోజు విరామంతోనే ఐదు టీ20లు జరగనున్నాయి. పొట్టి క్రికెట్‌ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు జంబో జట్టునే ప్రకటించారు. మరికొన్ని నెలల్లోనే టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో ఆటగాళ్లను పరీక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇంతలోనే క్రికెటర్లు గాయాలు, ఫిట్‌నెస్‌ ఇబ్బందులతో దూరమవ్వడం కలవర పెడుతోంది.

తమిళనాడు యువపేసర్‌ తంగరసు నటరాజన్‌ ఐపీఎల్‌ 2020లో అదరగొట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా వెళ్లి మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. తన బలమైన యార్కర్లను నిక్కచ్చిగా విసురుతూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు. ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడలేకపోయిన నట్టూ గాయం కారణంగా బెంగళూరులోని ఎన్‌సీఏలో శిక్షణ పొందుతున్నాడు. మార్చి 12 వరకు అతడు అందుబాటులో ఉండడని ఎన్‌సీఏ బృందం జట్టు యాజమాన్యానికి సమాచారం ఇచ్చింది. కానీ అతడికి ఎలాంటి గాయమైంది? తీవ్రత ఏంటన్నది ఇంకా తెలియలేదు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా దూరమైన నేపథ్యంలో నట్టూ అవసరం కోహ్లీసేనకు ఎంతగానో ఉంది.

ఐపీఎల్‌, టీఎన్‌పీఎల్‌ లీగుల్లో అదరగొట్టిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటున్న అతడిని సెలక్టర్లు ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ఎంపిక చేశారు. బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన పరుగు పోటీలో అతడు రెండుసార్లు అర్హత సాధించలేదని సమాచారం. ప్రమాణాలకు దీటుగా అతడి దేహదారుఢ్యం లేదని తెలుస్తోంది. దాంతో అతడు జట్టుకు దూరం కాక తప్పని పరిస్థితి. రాజస్థాన్‌ రాయల్స్‌కు గతేడాది అద్భుత విజయాలు అందించిన రాహుల్‌ తెవాతియాదీ ఇలాగే ఉంది. రెండోసారి అతడిని ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించనున్నారు. టీమ్‌ఇండియాకు ఆడాలన్న అతడి కల సులభంగా నెరవేరేలా కనిపించడం లేదు! జట్టులో అతడికి ఎలాంటి పాత్ర ఇవ్వాలన్న దానిపైనా ఇంకా స్పష్టత లేదు. కాగా ఇప్పటికే నెట్‌బౌలర్‌గా అహ్మదాబాద్‌లో ఉన్న రాహుల్‌ చాహర్‌ను చక్రవర్తి స్థానంలో ఎంపిక చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని