close
Published : 09/01/2021 14:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

థియేటర్లోకి ‘టక్‌ జగదీష్‌’ఎప్పుడంటే?


హైదరాబాద్‌: ‘నేచురల్‌ స్టార్‌’ నాని హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్‌ జగదీష్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్‌ 16న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సకుటుంబ సపరివార సమేతంగా నానీని పెళ్లికొడుకును చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది.

జగపతిబాబు, నరేష్‌, నాజర్‌, రావు రమేష్‌, రోహిణి వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు. షైన్స్‌ స్క్రీన్స్‌ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. గతంలో ‘నిన్ను కోరి’చిత్రంతో నాని-శివ నిర్వాణ కాంబో హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. మరోపక్క నాని నటిస్తున్న ‘శ్యామ్‌సింగరాయ్‌’ అనే చిత్రం కూడా సెట్స్‌పై ఉంది.

ఇవీ చదవండి!

ధనుష్‌ కొత్త చిత్రం ప్రారంభం

సంక్రాంతి ‘సినీ ట్రైలర్ల’ హంగామా!


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని