నా భర్త క్షేమంగానే ఉన్నారు: నజ్రియా  - nazriya about her husband health condtion
close
Published : 10/03/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా భర్త క్షేమంగానే ఉన్నారు: నజ్రియా 

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన భర్త, నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు నటి నజ్రియా నజీమ్‌. నిద్రిస్తున్న ఫాహద్‌ ఫొటోని అభిమానులతో పంచుకుంటూ అంతా క్షేమం అని చెప్పారు. ‘మలయన్కుంజు’ అనే మలయాళ చిత్రం షూటింగ్‌లో మార్చి 3న ప్రమాదానికి గురయ్యారు ఫాజిల్‌. యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు అదుపుతప్పి భవనం పై నుంచి కిందకు పడటంతో ఆయన ముక్కుకు తీవ్ర గాయమైంది. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పూర్తైన అనంతరం ఫాజిల్‌ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అని ఆందోళనలో ఉన్న అభిమానులకు శుభవార్త వినిపించారు నజ్రియా.

ఫాజిల్‌, నజ్రియా 2014లో ఒకటయ్యారు. ‘రాజారాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు నజ్రియా. ప్రస్తుతం నాని కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘అంటే సుందరానికీ!’ చిత్రంలో నాయికగా ఎంపికయ్యారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని