దండేలి అడవుల్లో ‘బీబీ3’ క్లైమాక్స్ షూటింగ్‌ - nbk bb3 climax to be shot in dandeli forest
close
Updated : 25/03/2021 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దండేలి అడవుల్లో ‘బీబీ3’ క్లైమాక్స్ షూటింగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: బాలకృష్ణ  కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘బీబీ3’ వర్కింగ్‌ టైటిల్‌గా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ కర్ణాటకలోని దండేలి అభయారణ్యంలో పతాక సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నట్లు సమాచారం. బాలయ్య - ప్రగ్యాజైస్వాల్‌ ఇతర నటులపై స్టంట్‌ మాస్టర్‌ శివ పర్యవేక్షణలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు బోయపాటి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారట. ఈ షెడ్యూల్‌ ఏప్రిల్ 3 నాటికి పూర్తి కానుంది.

 ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ - ప్రగ్యాజైస్వాల్ ఐఏయస్‌ అధికారులుగా కనిపించనున్నారు. మరో నటి పూర్ణ  వైద్యురాలి పాత్రలో కనిపించనుందట. అయితే ఆమె పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయని టాలీవుడ్‌ టాక్‌. శ్రీకాంత్‌ కీలక పాత్రలో పోషించనున్నారు. చిత్రానికి ‘గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. తమన్‌ సంగీత స్వరాలు అందిస్తుండగా రామ్ ప్రసాద్‌ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ ఏడాది మే 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని