ట్రెండింగ్‌లో బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ రోర్ - nbk trending akhanda movie title roar video‌
close
Updated : 14/04/2021 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రెండింగ్‌లో బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ రోర్

ఇంటర్నెట్‌ డెస్క్: నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఎలాంటి పేరు పెడతారని చాలా కాలం చిత్రసీమతో పాటు బాలకృష్ణ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. ఏప్రిల్‌ 13 ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమా పేరును ‘అఖండ’గా ఖరారు చేస్తూ టీజర్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ‘అఖండ’ టైటిల్‌ రోర్‌ నెట్టింట తెగ సందడి చేస్తుంది. టైటిల్‌ రోర్‌ విడుదలైన కేవలం 24 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకొని 250 (కె)లైక్స్ తో సామాజిక మాధ్యమాల్లో నెం1 ట్రెండింగ్‌గా దూసుకెళ్తుంది. టీజర్లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌...‘‘కాలు దువ్వే నంది ముందు.. రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది...’ అంటూ ఆయన పలికిన సంభాషణ అభిమానులతో పాటు వీక్షకులను ఆకట్టుకుంటోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కథానాయికగా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. ఇందులో శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీత దర్శకుడిగా  సి.రాంప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మాటలు: ఎం.రత్నం, స్టంట్‌మాస్టర్లుగా రామ్‌ - లక్ష్మణ్ పనిచేస్తున్నారు. మే 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని