కౌశల్‌ భార్యకు యూకేలో చేదు అనుభవం - neelima kaushal covid treatment experience in uk
close
Published : 04/06/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కౌశల్‌ భార్యకు యూకేలో చేదు అనుభవం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బిగ్‌బాస్2’ విజేత కౌశల్‌ మండా భార్య నీలిమకు యూకే(యునైటెడ్‌ కింగ్‌డమ్‌)లో చేదు అనుభవం ఎదురైందట..! ఈ విషయాన్ని ఆమె ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ఉద్యోగం రీత్యా యూకే వెళ్లిన ఆమె కరోనా బారిన పడ్డారు. దీంతో అక్కడే చికిత్స పొందాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అక్కడి ఆసుపత్రిలో చికిత్స అందించిన విధానంపై ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌తో పోలిస్తే అక్కడ దారుణమైన పరిస్థితులున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. ఆ వీడియోను కౌశల్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

‘‘నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. ఏడు రోజుల క్రితం నాకు కరోనా సోకింది. భారత్‌లో దారుణమైన, భయంకర పరిస్థితులు ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ, ఇక్కడే ఘోరంగా ఉంది. కరోనా సోకడంతో నాకు ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. ఛాతి నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది. నా పరిస్థితి బాగాలేదని వైద్యుల‌కు చెప్పాను. కానీ, వాళ్లు కేవలం పారాసిటమాల్‌ మాత్రమే ఇచ్చారు. అంత‌కు మించి పెద్దగా పట్టించుకోలేదు. పైగా క‌రోనా ల‌క్షణాలు అలాగే ఉంటాయ‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు. యూకేలో చికిత్స గొప్పగా ఉంటుందనుకున్నాను. కానీ ఇక్కడి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని అర్థమైంది. నా జీవితంలో ఇది ఒక చేదు అనుభవం. మ‌న‌దేశంలో అయితే వెంట‌నే వైద్యం అందిస్తారు. ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తున్నారు. కాబట్టి మీరెవరూ భయపడొద్దు. మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. త్వరలోనే భారత్‌కు తిరిగొస్తాను’’ అని నీలిమ ఆ వీడియోలో పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని