నీట్‌-పీజీ పరీక్షలు వాయిదా  - neet post-grad exam scheduled on sunday deferred
close
Published : 15/04/2021 19:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీట్‌-పీజీ పరీక్షలు వాయిదా 

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న జరగాల్సిన నీట్‌ పీజీ మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తున్న వేళ ఆఫ్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహించనుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌ ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ట్విటర్‌లో వెల్లడించారు. యువ వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా పరిస్థితిని బట్టి ఈ పరీక్షకు కొత్త తేదీని తర్వాత వెల్లడిస్తామన్నారు.  మరోవైపు, కరోనా వైరస్‌ రెండో విజృంభణ నేపథ్యంలో నీట్‌ పీజీ పరీక్షలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో వైద్యుల బృందం గురువారం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని