కరోనా: నెల్లూరులో అమానవీయం.. - neighbors locked corona patients in apartment at nellore
close
Updated : 21/04/2021 10:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా: నెల్లూరులో అమానవీయం..

నెల్లూరు: అసలే వైరస్ సోకి అవస్థలు పడుతున్నారు. పది రోజులుగా ఇంటికే పరిమితమై తెలిసినవారిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇరుగుపొరుగువారు చేతనైన సాయం చేయలేదు సరికదా.. మరింత నిర్దయగా వ్యవహరించారు. వారు బయటకు రాకుండా ఇంటికి తాళం వేశారు. ఈ అమానవీయ ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న భార్యాభర్తలకు 10 రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో వారు హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. బంధువుల ద్వారా అవసరమైన మందులు, నిత్యావసరాలు తెప్పించుకుంటున్నారు. సోమవారం రాత్రి మందులు అవసరం కాగా ఎవరూ అందుబాటులో లేరు. తప్పనిసరి పరిస్థితుల్లో భర్త బయటకు వెళ్లి మందులు తీసుకొచ్చాడు. ఇది గమనించిన అపార్ట్‌మెంట్‌ వాసులు వారి ఇంటికి తాళం వేశారు.

కరోనా సోకిన వ్యక్తి బయటకు వచ్చినందువల్లే తాళం వేసినట్లు అపార్ట్‌మెంట్‌ వాసులు పేర్కొంటున్నారు. వైరస్‌ సోకిన నాటినుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కనికరం లేకుండా తాళం వేశారని ఆ బాధితులు వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి ఇంటికి వెళ్లి తాళం తొలగించారు. ఆ విధంగా వ్యవహరించడం సరికాదని అపార్ట్‌మెంట్‌ వాసులకు సర్దిచెప్పారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని