Vakeelsaab: కుర్రాళ్లు ఇరగదీశారుగా! - nellore boys recreates the vakeel saab fight scene
close
Published : 24/05/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vakeelsaab: కుర్రాళ్లు ఇరగదీశారుగా!

వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన పవర్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘వకీల్‌సాబ్‌’. పవన్‌ని స్క్రీన్‌పై ఏవిధంగా చూడాలని ఓ అభిమాని కోరుకుంటాడో అంతే పవర్‌ఫుల్‌గా చూపించారు దర్శకుడు వేణు శ్రీరామ్‌. సినిమాలోని విజువల్స్‌తోపాటు తమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో థియేటర్లలో అందరూ ఈలలు వేశారు. కాగా, తాజాగా ‘వకీల్‌సాబ్‌’ సినిమాలోని ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ని రీక్రియేట్‌ చేస్తూ నెల్లూరుకు చెందిన కొంతమంది కుర్రాళ్లు ఓ వీడియో తెరకెక్కించారు. సినిమాలో చూపించిన దానికి ఏమాత్రం తీసిపోకుండా యాక్షన్‌ సన్నివేశాలను కుర్రాళ్లు ఎంతో పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. ఈ వీడియోని గుంటూరు పవర్‌స్టార్‌ అభిమానులు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. దాంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. ‘కుర్రాళ్లు ఇరగదీశారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’తో కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. ‘గబ్బర్‌సింగ్‌’, ‘కాటమరాయుడు’ తర్వాత పవన్‌కల్యాణ్‌ - శ్రుతిహాసన్‌ జంటగా నటించిన మూడో చిత్రమిది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేధా థామస్‌, అంజలి, అనన్యపాండే కీలకపాత్రలు పోషించారు. ప్రకాశ్‌రాజ్‌ నందు పాత్రలో మెప్పించారు. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని