Lockdown: ఈ-పాస్‌లు ఇవ్వండి మహాప్రభో! - netizens complains to the dgp to issue epass
close
Updated : 24/05/2021 22:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown: ఈ-పాస్‌లు ఇవ్వండి మహాప్రభో!

హైదరాబాద్‌: పోలీసులు జారీ చేస్తున్న ఈ-పాస్‌లు అందడం లేదని పలువురు నెటిజన్లు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నారు. అత్యవసరం ఉన్నవారి దరఖాస్తులను కూడా తిరస్కరిస్తున్నారని ట్విటర్‌ ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. కరోనా వల్ల ఆస్పత్రి పాలైన మనవరాలిని చూసేందుకు ఈ-పాస్‌లో దరఖాస్తు చేస్తే పోలీసులు తిరస్కరించారని ఓ వైద్యుడు ఫిర్యాదు చేశారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న తన తల్లిని వైద్యుడికి చూపించడానికి రెండ్రోజుల క్రితం దరఖాస్తు చేసినా.. ఎలాంటి పురోగతి లేదని మరో యువకుడు డీజీపీకి ట్వీట్‌ చేశారు. జగిత్యాలకు చెందిన తలసేమియా వ్యాధిగ్రస్తుడు హైదరాబాద్‌ రావడానికి దరఖాస్తు చేస్తే పోలీసులు దాన్ని కూడా తిరస్కరించారని, మరో నెటిజన్‌ ఫిర్యాదు చేశారు. ఇలా వస్తున్న ఫిర్యాదులను స్వీకరిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి సమస్యను చూసి పరిష్కరించాల్సిందిగా.. పోలీసులకు ట్విటర్‌ ద్వారా సూచించారు. ధ్రువపత్రాలు లేకుండా బయటకొచ్చే వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో చాలా మంది ఈపాస్‌లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. పరిశీలనలో పలు దరఖాస్తులను తిరస్కరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని