Virat Kohli: ‘వీగన్‌’ అని చెప్పానా ఎప్పుడైనా? - never claimed im vegan says virat kohli
close
Published : 01/06/2021 19:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Virat Kohli: ‘వీగన్‌’ అని చెప్పానా ఎప్పుడైనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన ఆహార పద్ధతులపై విమర్శలు చేస్తున్న వారికి టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ జవాబిచ్చాడు. పూర్తిగా ‘వీగన్‌’గా మారానని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశాడు. తానొక ‘వెజిటేరియన్‌’ మాత్రమేనని ప్రతిసారీ చెప్పానని వెల్లడించాడు. ‘ఇప్పుడిక ఊపిరి పీల్చుకొని మీ కూరగాయలు మీరు తినండి’ అని పంచ్‌ ఇచ్చాడు.

ముంబయిలో విరాట్‌ కోహ్లీ క్వారంటైన్‌లో ఉన్నాడు. ఖాళీ సమయం దొరకడంతో అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటించాడు. వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు. ధోనీతో అనుబంధం, క్రికెట్‌ గురించి వివరించాడు. రోజు ఎలా గడుస్తోందని ఒకరు అడగ్గా ‘ఒకసారి సాధన చేస్తాను. కుటుంబంతో గడుపుతాను’ అని సమాధానం ఇచ్చాడు. మరొకరు ‘మీ ఆహారపు అలవాట్లేంటి (డైట్‌)’ అని ప్రశ్నించగా...

‘ఎక్కువగా కూరగాయలు, ఆకు కూరలు, కొన్ని గుడ్లు, రెండు కప్పుల కాఫీ, పప్పు, క్వినోవా, అధిక మోతాదులో పాలకూర.. దోసెలన్నా ఇష్టం. ఏవైనా సరే పరిమితంగానే తీసుకుంటా’ అని చెప్పాడు. దాంతో గతంలో కోహ్లీ పూర్తి వీగన్‌గా మారాడని, ఇప్పుడు గుడ్లు ఎలా తింటున్నాడని నెటిజన్లు విమర్శలు కురిపించారు. దాంతో ‘నేను వీగన్‌ అని ఎప్పుడూ చెప్పలేదు. వెజిటేరియన్‌ అనే చెప్పాను. ఇప్పుడు మీరిక దీర్ఘ శ్వాస తీసుకొని మీ కూరగాయలు తినండి (తినాలనుకుంటేనే!)’ అని ట్వీట్‌ చేశాడు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని