close

తాజా వార్తలు

Updated : 01/04/2020 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా..కరోనా.. నీతో యుద్ధం చేస్తాం

హైదరాబాద్‌: ‘కరోనా.. కరోనా.. నీతో యుద్ధం చేస్తాం..’ అంటున్నారు సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌. యావత్‌ ప్రపంచాన్ని చిగురుటాకులా వణికుస్తున్న కరోనా వైరస్‌ని తరిమికొట్టేందుకు సినీ కళాకారులు సైతం సై అంటున్నారు. తమదైన శైలిలో పాటలు పాడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.అటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సెలబ్రిటీలతో కరోనా కట్టడిపై అవగాహన కల్పిస్తూ.. వీడియోలను విడుదల చేస్తున్నాయి.

తాజాగా వందేమాతరం శ్రీనివాస్‌ కరోనాపై పాటను రూపొందించారు. ‘కరోనా... నీతో యుద్ధం చేస్తాం.. మా భారత భూభాగాన. కరోనా, కరోనా.. నీతో మట్టికరిపిస్తాం.. 130 కోట్ల జనం సరేనా.. కరోనా.. మేం కాలు బయటపెట్టం..’ అంటూ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ పాట యూట్యూబ్‌లో విశేషంగా ఆకట్టుకుంటోంది. మరో సంగీత దర్శకుడు కీరవాణి సైతం  ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ సినిమాలోని ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..’ పాట సాహిత్యం మార్చి మరో పాటను రూపొందించిన విషయం తెలిసిందే. 

 

 



Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని