సమయం లేదు మిత్రమా..! - new movie updates
close
Updated : 29/01/2021 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమయం లేదు మిత్రమా..!

సోషల్‌మీడియాలో వరుస కట్టిన అప్‌డేట్స్‌

హైదరాబాద్‌: గతేడాది నుంచి కొత్త చిత్రాల విశేషాలు లేక వెలవెలబోతున్న టాలీవుడ్‌లో ఒక్కసారిగా అప్‌డేట్‌ల మోత మోగుతోంది. కొత్త సినిమా అప్‌డేట్స్‌తో పాటు, తాజాగా మరికొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా బయటకు వచ్చాయి. ‘సమయం లేదు మిత్రమా’ అన్నట్లు అవి వరుస కట్టాయి. కొన్ని భారీ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లు.. మరికొన్ని విడుదల తేదీల ప్రకటనలతో సోషల్‌మీడియా కళకళలాడుతోంది.

నాగ్‌అశ్విన్‌-ప్రభాస్‌ అప్‌డేట్‌ ఇదే

నాగ్‌అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్‌ రానున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియన్‌ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ సరికొత్త అప్‌డేట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ ఈ రోజు అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలు అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా డానీ శాన్‌షెజ్‌ లొఫెజ్‌ డీఓపీగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా దీపికా పదుకొణె నటించనుండగా అమితాబ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.


అడివి శేష్‌ ‘మేజర్‌’

ముంబయి ఉగ్రదాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమా ‘మేజర్‌’. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన భారీ అప్‌డేట్‌ను తాజాగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈమేరకు జులై 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


మోహన్‌బాబు ఇలా..

మంచు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మోహన్‌బాబు ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం నెటిజన్లతో పంచుకుంది. ఇందులో నటి ప్రగ్యాజైశ్వాల్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇవీ చదవండి

ప్రభాస్‌ ఎంట్రీ మామూలుగా ఉండదట..!

తారక్‌ ప్రేయసి జెన్నీఫర్‌ వచ్చేసింది..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని