మూడు ఇటే... ఆ ఒక్కటీ ఎటు? - new movies releases in bollywood
close
Published : 22/01/2021 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడు ఇటే... ఆ ఒక్కటీ ఎటు?

కరోనా ప్రభావం తగ్గుతోంది...వ్యవస్థలు ఒక్కొక్కటిగా గాడినపడే ప్రయత్నాల్లో ఉన్నాయి. కరోనా దెబ్బకు కుదేలైపోయిన చిత్ర పరిశ్రమ కొత్త ఆశలతో ప్రయాణం మొదలుపెట్టింది. థియేటర్లు తెరచుకున్నాయి. షూటింగులు జోరుగా సాగుతున్నాయి. దక్షిణాదిలో సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. బాలీవుడ్‌లో మాత్రం ఆ హడావిడి లేదు. కొత్త ఏడాది మొదలై 20 రోజులు దాటిపోతున్నా సరైన సినిమా ఇంకా థియేటర్లలో పడలేదు. దీంతో దేశవ్యాప్తంగా థియేటర్ల యాజమాన్యాలు ఆందోళనలో పడ్డాయి.

బాలీవుడ్‌లో ఏ సినిమా పక్కాగా విడుదల తేదీని ప్రకటించలేదు. ఇప్పటివరకూ ఓటీటీలవైపు చూసిన చిత్రాలు ఇకపై థియేటర్లలోనే సందడి చేస్తాయని పరిశ్రమ ఆశగా ఎదురుచూస్తోంది. వాటికి బలాన్ని చేకూరుస్తూ సల్మాన్‌ఖాన్‌ ‘రాధే’ చిత్రాన్ని థియేటర్లలోనే ఈద్‌కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఆ వర్గాలకు ఉత్సాహాన్నిచ్చింది. అక్షయ్‌కుమార్‌ ‘సూర్యవంశీ’ని థియేటర్లలోనే విడుదల చేయనున్నారు. మరి అక్షయ్‌ నటించిన ‘బెల్‌బాటమ్‌’ని ఓటీటీ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి...ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే..దీనిపై బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ మొదలైంది.

అక్షయ్‌ నటించిన ‘సూర్యవంశీ’ గత ఏడాదే రావాల్సి ఉన్నా ఓటీటీకి వెళ్లకుండా ఇన్ని నెలలు థియేటర్ల కోసమే ఎదురుచూశారు. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు కానీ మార్చిలో వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏడాది రానున్న భారీ చిత్రాల్లో ఇది ఒకటి. బహుశా ఈ ఏడాదికి ఇదే థియేటర్లలో రానున్న తొలి అగ్ర హీరో చిత్రం. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌, అజయ్‌దేవగణ్‌ అతిథి పాత్రల్లో నటించారు. రోహిత్‌ శెట్టి దర్శకుడు కావడం... ఇంతమంది అగ్ర తారలు ఉండటంతో ప్రేక్షకుల్ని థియేటర్లవైపు కచ్చితంగా అడుగులు వేయిస్తుందని భావిస్తున్నారు.

రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘83’ రెండు మూడు నెలల్లోనే వచ్చే అవకాశం ఉంది. రిపబ్లిక్‌ డేకి విడుదల అనుకున్నా... చిత్రబృందం ఇంకా తేదీని ప్రకటించలేదు. దీని తర్వాత సల్మాన్‌ ‘రాధే’ వస్తుంది. ఇదీ మాస్‌ అంశాలతో అలరించడం ఖాయం అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. అంటే మేలోగా మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. కరోనా మరింత నెమ్మదించి థియేటర్లల్లో ఆక్యుపెన్సీ శాతాన్ని 50 నుంచి పెంచితే మరింతగా కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

అక్షయ్‌కుమార్‌ ‘బెల్‌బాటమ్‌’ కోసం అమెజాన్‌ ప్రైమ్‌ రూ.130 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందని, నిర్మాతలు రూ.150 కోట్లు అడుగుతున్నారంటూ వార్తలొస్తున్నాయి. ఇదే సమయంలో మరో విషయమూ బయటకొచ్చింది. ‘సూర్యవంశీ’ విడుదల తర్వాత పరిస్థితిని బట్టి ‘బెల్‌బాటమ్‌’ని థియేటర్లలో విడుదల చేయాలా? ఓటీటీకి ఇవ్వాలా అనే ఆలోచనలో చిత్రవర్గాలు ఉన్నాయట. పైగా ఈలోపు థియేటర్ల ఆక్యుపెన్సీ రేటు కూడా పెరుగుతుంది. ప్రేక్షకులు థియేటర్లకు ఎప్పటిలా అలవాటు పడతారు అని ‘బెల్‌బాటమ్‌’ టీమ్‌ ఆలోచనలు చేస్తుందని సమాచారం. ‘సూర్యవంశీ’ మార్చి- ఏప్రిల్‌లో వచ్చినా ఆ తర్వాత రెండు నెలలకు జూన్‌లో ‘బెల్‌బాటమ్‌’ రావడం కలిసొచ్చే అంశమంటున్నారు బాలీవుడ్‌ వర్గాలు.

లక్షలాది మంది ఆధారపడిన థియేటర్ల వ్యవస్థ గాడిన పడాలంటే భారీ చిత్రాలు థియేటర్ల ముందు వరస  కట్టాల్సిందే. ఎంతోమందిని స్టార్‌ హీరోలుగా నిలబెట్టింది థియేటర్లే కాబట్టి ఇప్పుడు వాటిని నిలబెట్టుకోవడం ఆయా హీరోల బాధ్యత అని కొందరు ప్రముఖ ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి
మెరుపు కాంబినేషన్లు.. విజయ వీచికలుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని