Krithishetty: అనుకోని అవకాశం.. అందలం ఎక్కించింది - new projects of krithishetty
close
Published : 09/07/2021 09:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Krithishetty: అనుకోని అవకాశం.. అందలం ఎక్కించింది

యువ హీరోల చిత్రాలతో క్యాలెండర్‌ బిజీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఉప్పెన’తో బేబమ్మగా తెలుగువారికి చేరువైన కన్నడ ముద్దుగుమ్మ కృతిశెట్టి. మొదటి సినిమాకే విపరీతమైన ఫ్యాన్‌ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ లేడీగా మారారు. వరుస సినిమాలకు పచ్చజెండా ఊపుతూ తన కాల్షీట్‌ నింపేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కృతిశెట్టి కెరీర్‌.. ఆమె చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్‌లపై ఓ లుక్కేద్దాం..!

చిన్నప్పుడే వచ్చింది..!

కృతిశెట్టికి చిన్నతనం నుంచి నటన అంటే ఎంతో ఇష్టం. స్కూల్‌కు వెళ్లే వయసులోనే నటిగా రాణించాలని ఆమె ఫిక్స్‌ అయ్యారు. ఇందులో భాగంగానే కెమెరా ఫియర్‌ పోగొట్టుకోవడం కోసం చిన్నతనంలోనే యాడ్‌ షూట్‌లో పాల్గొన్నారు. మొట్టమొదటిసారి ఆమె ఓ వస్త్ర దుకాణాల వాణిజ్య ప్రకటనలో పాల్గొన్నారు. అనంతరం ‘లైఫ్‌బాయ్‌’, ‘డైరీమిల్క్‌ చాక్లెట్‌’తోపాటు ఓ పెన్నుల కంపెనీ యాడ్‌లో కూడా ఆమె నటించారు. హృతిక్‌రోషన్‌ కథానాయకుడిగా 2019లో విడుదలైన ‘సూపర్‌ 30’తో ఆమె తొలిసారి వెండితెరపై తళుక్కున మెరిశారు.


అనుకోని అవకాశం..

బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాలో మొదట హీరోయిన్‌గా మనీషా అనే తెలుగమ్మాయిని తీసుకున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి కొన్నిరోజుల ముందు సోషల్‌మీడియాలో కృతిశెట్టి ఫొటోలు చూశారు దర్శకుడు. ‘ఉప్పెన’లో మనీషా కంటే కృతిశెట్టి అయితేనే బాగుంటుందని ఆయన భావించారు. వెంటనే తన బృందంలోకి కృతిశెట్టిని ఆహ్వానించారు. అలా, అనుకోకుండా అవకాశాన్ని సొంతం చేసుకున్న కృతిశెట్టి ‘ఉప్పెన’తో తనలోని నటిని ప్రేక్షకులకు చేరువ చేశారు.


క్యాలెండర్‌ ఫుల్‌ బిజీ..!

‘ఉప్పెన’ విజయం తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వరించాయి. దాంతో ఆమె క్యాలెండర్ రెండేళ్లపాటు నిండిపోయిందని సమాచారం. ఇప్పటికే మూడు సినిమాలకు ఓకే చేసిన కృతి.. రానున్న రోజుల్లో మరో రెండు ప్రాజెక్ట్‌లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమా ప్రాజెక్ట్‌లు..

శ్యామ్‌ సింగరాయ్‌..

నాని కథానాయకుడిగా విభిన్నమైన లుక్‌లో కనిపించనున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి సందడి చేయనున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కృతి నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు అందించనున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి..

నటుడు సుధీర్‌బాబు ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో కృతిశెట్టి కథానాయిక. వివేక్‌ సాగర్‌ స్వరాలు అందించనున్నారు.

#RAPO19..

కృతిశెట్టి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఇది ఒక్కటి. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో బేబమ్మ కథానాయిక. మాస్‌, కమర్షియల్‌ హంగులతో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా మరికొన్నిరోజుల్లో పట్టాలెక్కనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించనున్నారు.

నితిన్‌.. నాగచైతన్య..

తాజా సమాచారం ప్రకారం కృతిశెట్టి మరో ఇద్దరు యువ హీరోల ప్రాజెక్ట్‌లు ఓకే చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి.. నితిన్‌ ప్రాజెక్ట్‌‌.. మరొకటి నాగార్జున ప్రధాన పాత్రలో నటించనున్న ‘బంగార్రాజు’. నితిన్ హీరో వీఆర్‌ శేఖర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇందులో కృతిశెట్టిని కథానాయికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నాగార్జున ప్రధాన పాత్రలో త్వరలో తెరకెక్కనున్న ‘బంగార్రాజు’లో నాగచైతన్య ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇందులో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టిని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్‌లపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని