రష్యాలో కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ - new strain of coronavirus discovered in moscow by russian scientists
close
Updated : 17/06/2021 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్యాలో కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌

మాస్కో: ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్‌ మరోసారి రూపాంతరం చెందింది. తాజాగా కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ను కనుగొన్నట్లు రష్యాలోని గమలేయా నేషనల్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. మాస్కోలో తొలిసారిగా వెలుగుచూడటంతో ఈ వైరస్‌ను అదే నగరం పేరుతో పిలుస్తున్నట్టు తెలిపారు. రష్యాలో కేసుల సంఖ్య విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు చేయగా ఈ రకం వైరస్ వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. తాజా స్ట్రెయిన్‌ వైరస్‌పై స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ ఎంతమేర ప్రభావం చూపుతుందో తెలుసుకునే పనిలో  శాస్త్రవేత్తలు నిమగ్నమైనట్టు గమలేయా నేషనల్‌ సెంటర్‌ హెడ్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ వివరించారు. అయితే కొత్త స్ట్రెయిన్‌పై వ్యాక్సిన్‌ సమర్థంగానే పని చేస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వైరస్‌పై పరిమిత సమాచారం మాత్రమే ఉందని వెల్లడించారు. రష్యాలో బుధవారం కొత్తగా 13.397 కరోనా కేసులు నమోదవగా వీటిలో 5,782 కేసులు మాస్కోలోనే వెలుగుచూశాయి. ఇదే రోజు దేశంలో 396 మరణాలు నమోదయ్యాయి. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని