New Zealand: 18 ఏళ్ల తర్వాత పాక్‌ పర్యటనకు న్యూజిలాండ్‌ జట్టు - new zealand cricket team arrives in pakistan for first tour in 18 years
close
Published : 11/09/2021 23:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

New Zealand: 18 ఏళ్ల తర్వాత పాక్‌ పర్యటనకు న్యూజిలాండ్‌ జట్టు

ఇంటర్నెట్‌డెస్క్‌: పద్దెనిమిదేళ్ల తర్వాత న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. 3 వన్డేలు, 5 టీ20 మ్యాచుల్లో తలపడేందుకు ఆ జట్టు శనివారం పాకిస్థాన్‌ చేరుకుంది. బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్‌లో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు హోటల్‌కి వెళ్లారు. ‘పాకిస్థాన్‌లో మళ్లీ పర్యటించడం చాలా ఆనందంగా ఉంది’ అని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ పేర్కొన్నాడు. మరి కొందరు ఆటగాళ్లు టాడ్‌ అసిల్‌, మార్క్ చాప్‌మన్‌, మార్టిన్‌ గప్తిల్‌, డెరిల్‌ మిచెల్‌, ఇష్‌ సోథీ ఆదివారం పాకిస్థాన్‌ చేరుకోనున్నారు. కరోనా నేపథ్యంలో స్టేడియం మొత్తం సామర్థ్యంలో కేవలం 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే ప్రత్యక్ష మ్యాచులకు అనుమతించనున్నారు. సెప్టెంబరు 17 నుంచి వన్డేలు, 25 నుంచి టీ20 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. కేన్‌ విలియమ్సన్‌ సహా పలువురు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ కారణంగా పాకిస్థాన్‌ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే.

2002లో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కరాచీలో బస చేస్తున్న హోటల్‌కి సమీపంలో బాంబు దాడి జరిగింది. దీంతో ఆటగాళ్లు అర్ధాంతరంగా తమ స్వదేశానికి పయనమయ్యారు. ఆ తర్వాత చివరి సారిగా 2003లో పాకిస్థాన్‌లో 5 వన్డే మ్యాచులు ఆడారు. అప్పటి నుంచి న్యూజిలాండ్‌ ఆటగాళ్లు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ జట్టు పాక్‌లో పర్యటిస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని