రెండు వారాల కవలల్లో కరోనా వైరస్‌ - newborn twins test positive for covid-19 in gujarat
close
Published : 03/04/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండు వారాల కవలల్లో కరోనా వైరస్‌

వడోదర: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ కోరలు చాచుతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందిరిలోనూ ఈ మహమ్మారి వెలుగుచూస్తోంది. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో ఈ మధ్యనే జన్మించిన కవలలకు కొవిడ్‌ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. జన్మించిన అనంతరం డిశ్చార్జి చేసి ఇంటికి పంపించగా.. 15 రోజుల తర్వాత వారిలో డీహైడ్రేషన్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో చిన్నారులను ఆసుపత్రికి తరలించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని