టీమ్‌ఇండియాకు కొత్త ఫిట్‌నెస్‌ టెస్టు? - news fitness test for team india
close
Updated : 22/01/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్‌ఇండియాకు కొత్త ఫిట్‌నెస్‌ టెస్టు?

8.15 నిమిషాల్లో 2 కి.మీ. పరిగెత్తాల్సిందే

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్లో పెరుగుతున్న ఫిట్‌నెస్‌ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేపట్టేందుకు బీసీసీఐ సిద్ధమైంది. టాప్‌ ఆటగాళ్ల దేహదారుఢ్యం, వేగాన్ని కొలిచేందుకు రెండు కిలోమీటర్ల  టైమ్‌ ట్రయల్స్‌ను నిర్వహించనుంది. కాంట్రాక్టు ఆటగాళ్లు, టీమ్‌ఇండియాలో చోటుకోసం శ్రమిస్తున్న క్రికెటర్లు ఇప్పుడున్న యోయో టెస్టుతో పాటు ఇందులోనూ తప్పక నెగ్గాల్సి ఉంటుంది.

‘దేహ దారుఢ్యాన్ని తర్వాతి దశకు తీసుకెళ్లేందుకు ఇప్పుడున్న ప్రమాణాలు కీలక పాత్ర పోషిస్తాయని బోర్డు అంచనా వేస్తోంది. ఫిట్‌నెస్‌ ప్రమాణాలను తర్వాతి స్థాయికి తీసుకెళ్లడం అత్యవసరం. టైమ్‌ ట్రయల్స్‌‌ కసరత్తు మరింత పోటీ పడేందుకు ఆటగాళ్లకు ఉపకరిస్తుంది. ఏటా ప్రమాణాలను బోర్డు సవరిస్తున్న సంగతి తెలిసిందే’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

కొత్త ప్రమాణాల ప్రకారం ఫాస్ట్‌ బౌలర్లు 8.15 నిమిషాల్లో 2 కిలోమీటర్లు పరుగెత్తాలి. బ్యాట్స్‌మెన్‌, వికెట్‌ కీపర్‌ అయితే 8.30 నిమిషాల్లో పరుగెత్తాలి. ఇక యోయో స్థాయి ఎప్పటిలాగే 17.1గా ఉండనుంది. సరికొత్త ప్రమాణాల గురించి ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే క్రికెటర్లకు బోర్డు తెలియజేసింది. ఏటా ఫిబ్రవరి, జూన్‌, ఆగస్టు/సెప్టెంబర్‌లో ఈ ట్రయల్స్‌ ఉంటాయని సమాచారం. ఇప్పటికైతే ఆస్ట్రేలియాకు వెళ్లొచ్చిన వారికి మినహాయింపు ఉంటుంది. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీసు, టీ20 ప్రపంచకప్‌కు పోటీపడేవాళ్లు మాత్రం టైమ్ ‌ట్రయల్స్‌ టెస్టులో పాల్గొనాల్సిందే.

ఇవీ చదవండి
ఆసీస్‌ కాదు.. టీమిండియాపై దృష్టిపెట్టండి 
అమ్మో.. టీమ్‌ఇండియాతో అంటే శ్రమించాల్సిందే

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని