సచిన్‌ వాజే ఇంటి నుంచి 62 బుల్లెట్లు స్వాధీనం - nia found 62 bullets from arrested police officer sachin waze house
close
Updated : 25/03/2021 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సచిన్‌ వాజే ఇంటి నుంచి 62 బుల్లెట్లు స్వాధీనం

న్యూదిల్లీ: సస్పెండై అరెస్టయిన ముంబయి పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే ఇంట్లో ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) సోదాలు కొనసాగుతున్నాయి.  తాజాగా ఆయన ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన తుపాకీ గుళ్లను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నిండిన కారు నిలిపి ఉంచిన కేసులో సచిన్‌ వాజే అరెస్టయిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా అన్ని కోణాల్లోనూ ఆయనను ప్రశ్నిస్తున్నారు. ‘మరిన్ని వివరాలను రాబట్టేందుకు నిందితుడిని ఇంకొన్ని రోజులు కస్టడీకి ఇవ్వండి’ అని ఎన్‌ఐఏ కోర్టుని కోరింది.

తాజాగా సచిన్‌ వాజే ఇంట్లో జరిపిన సోదాల్లో 62 బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ లెక్కలోనికి రానివి కావడం గమనార్హం. వాజే సర్వీస్‌ రివాల్వర్‌కు సంబంధించిన 30 బుల్లెట్లలో కేవలం ఐదింటిని మాత్రమే అధికారులు గుర్తించగా, మిగిలిన వాటి గురించి నిందితుడు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని అధికారులు తెలిపారు.

మరోవైపు ఈ కేసు దర్యాప్తును ఏన్‌ఐఏ అధికారులు వేగవంతం చేశారు. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నింపిన కారు యజమాని మనుసుక్‌ హిరెన్‌తో తనకెలాంటి సంబంధాలు లేవని సచిన్‌ వాజే చెబుతుండగా, ఫిబ్రవరి 17న మనుసుక్‌ను కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా ఆధారాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన అరెస్ట్‌పై సచిన్‌ వాజే మాట్లాడుతూ.. తనని బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఏప్రిల్‌ 3వ తేదీ వరకూ వాజేను ఎన్‌ఐఏ కస్టడికీ కోర్టు అనుమతించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని