విరసం నేతల ఇళ్లల్లో ఎన్‌ఐఏ సోదాలు - nia raids in telugu states
close
Updated : 01/04/2021 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విరసం నేతల ఇళ్లల్లో ఎన్‌ఐఏ సోదాలు

ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు

హైదరాబాద్‌: మావోయిస్టు కొరియర్‌ పంగి నాగన్న కేసు దర్యాప్తులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని విరసం, పౌరహక్కుల సంఘం నాయకుల ఇళ్లలో ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు జరిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి ఐదు చోట్ల, తెలంగాణలోని హైదరాబాద్‌లో పలు చోట్ల ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. గత ఏడాది విశాఖలోని ముంచింగిపుట్టులో మావోయిస్టు నాగన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మావోయిస్టు, పౌరహక్కుల సంఘం నేతలను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన కేసును రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఐఏకి బదిలీ చేసింది.

విచారణలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఏపీసీఎల్‌సీ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. చిట్టిబాబుపై ఉన్న వివిధ కేసులపై ఎన్ఐఏ బృందం ఆరా తీస్తోంది. అదే సమయంలో కర్నూలులో విరసం కార్యదర్శి పాణి, విశాఖలోని పిఠాపురం కాలనీలో న్యాయవాది కె.పద్మ, చినవాల్తేరులోని న్యాయవాది కె.ఎస్‌.చలం, అనంతపురం జిల్లా ప్రొద్దుటూరులో విరసం నేత వరలక్ష్మి ఇళ్లల్లో ఒకేసారి ఎన్ఐఏ బృందాలు సోదాలు చేశాయి. పూర్తి స్థాయి పోలీసు బందోబస్తుతో తనిఖీలు నిర్వహిస్తోంది. గత ఏడాది నవంబరులో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై వరలక్ష్మి సహా 27 మందిపై కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఈ కేసులను ఎన్ఐఏకు అప్పగించింది. 

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారథి, రాజాంలో ఏన్ఐఏ సోదాలు చేపట్టింది. పల్లిసారథిలో మాజీ మావోయిస్టు పోతనపల్లి అరుణను, రాజాంలో ప్రజాసంఘం నాయకుడు నీలకంఠాన్ని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి వీరిని విచారిస్తున్నారు. రెండు బృందాలుగా అధికారులు విచారణ చేపట్టారు. 

రఘునాథ్‌ అరెస్టు..

పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ అరెస్టు అయ్యారు. హైదరాబాద్‌లోని పీఅండ్‌టీ కాలనీలోని ఆయన ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రఘునాథ్‌ ఇంట్లో పలు పత్రాలు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు రఘునాథ్‌ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని