ఎన్‌ఐఏ సోదాలు.. కీలక ఆధారాలు లభ్యం - nia search completed in telangana
close
Updated : 01/04/2021 17:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్‌ఐఏ సోదాలు.. కీలక ఆధారాలు లభ్యం

తనిఖీలపై వివరాలు వెల్లడించిన జాతీయ దర్యాప్తు సంస్థ

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో ఉన్న పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వెల్లడించింది. తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌, మెదక్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, కడప జిల్లాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. సోదాల్లో 40 సెల్‌ఫోన్లు, 44 సిమ్‌ కార్డులు, 70 హార్డ్‌డిస్క్‌లు, మైక్రో ఎస్డీ కార్డులు, 19 పెన్‌డ్రైవ్‌లు, ఆడియో రికార్డర్స్, ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు, ప్రెస్‌ నోట్లతో పాటు రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు వివరించారు.

తెలంగాణలోని పలువురు పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించడంతో పాటు వారిని ప్రశ్నించింది. తెలంగాణకు చెందిన న్యాయవాది రఘునాథ్, డప్పు రమేశ్, జాన్, మహిళా సంఘం కార్యకర్త శిల్ప ఇళ్లల్లో తెల్లవారుజాము వరకు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఈ నలుగురికి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఎన్ఐఏ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టులో కేసులున్నందున ఈ నెల 3న తేదీన హాజరవుతానని న్యాయవాది రఘునాథ్ ఎన్ఐఏ అధికారులకు విజ్ఞప్తి చేయడంతో అందుకు అంగీకరించారు. అయితే ఎన్ఐఏ సోదాలను ప్రజసంఘాలు, పౌరహక్కుల సంఘం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేస్తున్నారని పలువురు నేతలు విమర్శించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని