Loose Hair: అందుకే జుట్టు లూస్‌గా వదిలేయొద్దనేది! - nicole richies hair caught fire at her 40th birthday party expect major screaming
close
Published : 24/09/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Loose Hair: అందుకే జుట్టు లూస్‌గా వదిలేయొద్దనేది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మాయిలు జుట్టు వదులుగా ఉంచుకోవడమేనది ఎప్పటి నుంచో ఒక ఫ్యాషన్‌గా మారింది. ఫ్యాషన్‌ మనకు అందాన్ని తీసుకొస్తే బాగానే ఉంటుంది అదే ప్రమాదానికి గురి చేస్తే... సరిగ్గా ఇలా ఉంటుందనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి పేరు నికోల్‌ రిచి. అమెరికాలో ఫేమస్‌ టీవీ సెలబ్రెటీ, ఫ్యాషన్‌ డిజైనర్‌, నటి. తన 40వ పుట్టినరోజు వేడుకులు జరుపుకొనేందుకు గ్రాండ్‌గా సిద్ధమైంది. కేకు కోసే సమయంలో తన హెయిర్‌ కాస్త వెలుగుతున్న కొవ్వొత్తులపై పడి కాలిపోయింది. దీంతో భయంతో కేకలు వేసిందామె. ఇక పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడ ఉన్నవారంతా నానా తిప్పలు పడ్డారు. కాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ వీడియోను పంచుకున్నారామె. కామెంట్‌ సెక్షన్‌లో నికోల్‌ భర్త జోయెల్‌.. ‘‘నువ్వు చాలా హాట్‌’’ అంటూ ఫన్నీగా స్పందించారు. కొవ్వొత్తులు ఊదేటప్పుడు అలాగే దీపావళి రోజు నాడు అమ్మాయిలు జట్టు వదులుగా ఉంచుకోకుండా ఉంటే.. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెబుతున్నారు నెటిజన్లు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని