బెంగళూరు సహా 7చోట్ల నైట్‌ కర్ఫ్యూ!  - night curfew in bengaluru 6 other cities in karnataka
close
Updated : 09/04/2021 09:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగళూరు సహా 7చోట్ల నైట్‌ కర్ఫ్యూ! 

బెంగళూరు: కర్ణాటకలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. బెంగళూరుతో పాటు ఏడు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. శనివారం నుంచి రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధానితో సమీక్ష ముగిసిన కొద్ది నిమిషాల్లోనే ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.  బెంగళూరు, మైసూరు, మంగళూరు, కలబురగి, బీదర్‌, తమకూరు, మణిపాల్‌లలో ఏప్రిల్‌ 20 వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని సీఎం యడియూరప్ప వెల్లడించారు. అత్యవసర సర్వీసులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. దేశంలోని కరోనా తీవ్రత ఉన్న 10 రాష్ట్రాల జాబితాలో కర్ణాటక ఉన్న విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని